Share News

KTR On Kavitha Letter: కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్‌ ఏమన్నారంటే

ABN , Publish Date - May 24 , 2025 | 11:40 AM

KTR On Kavitha Letter: కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా కవిత కామెంట్స్‌పై స్పందించిన కేటీఆర్.. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

KTR  On Kavitha Letter: కాక రేపుతున్న కవిత లేఖ.. కేటీఆర్‌ ఏమన్నారంటే
KTR On Kavitha Letter

హైదరాబాద్, మే 24: బీఆర్‌ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు (BRS Chief KCR) ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) రాసిన లేఖ తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు, కుట్రదారులు ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్స్ దుమారం సృష్టిస్తున్నాయి. తాజాగా కవిత వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు (శనివారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. అంతర్గత విషయాలను బయట మాట్లాడటం సరికాదన్నారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని చెప్పుకొచ్చారు. కవిత లేఖ పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని.. అందరం సమానమే అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు. కేసీఆర్‌కు లేఖలు రాయడం సహజమే అని.. కేసీఆర్‌కు సూచనలు చేయాలంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు అని మాజీ మంత్రి అన్నారు.


కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ (CM Revanth Reddy) పేరు ఉండటం తెలంగాణ సమాజానికే అవమానమన్నారు. రేవంత్‌ది సీటుకు రూటు కుంభకోణమంటూ విమర్శించారు. ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదని.. యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా చెప్పారన్నారు. రేవంత్‌కు బ్యాగ్‌మాన్ అనే పేరు ఎప్పుడో వచ్చిందన్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు. రేవంత్ మాటలు, మూటల ముఖ్యమంత్రి అంటూ దుయ్యబట్టారు. మూటలు పంచి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నారని.. తనని తాను కాపాడుకునేందుకు ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు ఢిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారని.. ఒకరు రాహుల్‌ గాంధీ.. మరొకరు మోదీ అన్నారు. 16 నెలల్లో 44 సార్లు ఢిల్లీ వెళ్లి అరుదైన రికార్డ్ సాధించారంటూ ఎద్దేవా చేశారు.


నిన్న రాత్రి చీకట్లో అమిత్‌షా కాళ్లు పట్టుకున్నారని.. అరెస్ట్ చేయొద్దని ఈడీకి చెప్పాలని వేడుకున్నారన్నారు. నిజాయితీ ఉంటే సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలని.. లేదంటే ఢిల్లీ పెద్దలే రేవంత్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. అవినీతి సీఎంను ఎందుకు కొనసాగిస్తున్నారో రాహుల్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి ఉందంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు రూటు అంటూ కామెంట్స్ చేశారు. యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు అయిందని ఆరోపించారు.


ఈడీ చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరున్నా బీజేపీ స్పందించడం లేదన్నారు. బీజేపీకి నిజాయితీ ఉంటే తెలంగాణలో స్కామ్‌లపై స్పందించాలని అన్నారు. తెలంగాణలో స్కామ్‌లపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని మోదీనే చెప్పారని.. ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ అవగాహనతో నడుస్తున్నాయన్నారు. పొంగులేటి ఇంట్లో ఈడీ తనిఖీలు జరిగి ఏడాదైందని.. తనిఖీల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను బీజేపీ నేతలు ఎందుకు కాపాడుతున్నారని అడిగారు. వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రూ.45 కోట్లు వచ్చాయని.. ఈ స్కాంలో నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.


కేంద్రానికి డెడ్‌లైన్

నెలరోజుల్లోగా రేవంత్ అవినీతిపై స్పందించకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామంటూ కేంద్రానికి డెడ్‌లైన్ విధించారు మాజీ మంత్రి. గవర్నర్‌ను కలిసి విచారణ కోరతామన్నారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, దెయ్యం రేవంత్‌రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించడమే తమ పని అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

నీతి ఆయోగ్ భేటీ.. తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

Read latest Telangana News And Telugu News

Updated Date - May 24 , 2025 | 12:58 PM