Share News

KTR Roadshow: జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ ప్రచారం.. షెడ్యూల్ ఫిక్స్

ABN , Publish Date - Oct 29 , 2025 | 01:20 PM

మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుస రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 31నుంచి నవంబర్ 9 వరకు నియోజకవర్గాన్ని చుట్టేయనున్నారు.

KTR Roadshow: జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ ప్రచారం.. షెడ్యూల్ ఫిక్స్
KTR Roadshow

హైదరాబాద్, అక్టోబర్ 29: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ (BRS) ప్రచారం ముమ్మరం చేసింది. ఆ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుస రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 31 నుంచి నవంబర్ 9 వరకు నియోజకవర్గాన్ని మాజీ మంత్రి చుట్టేయనున్నారు. వరుసగా 10 రోజుల పాటు బైపోల్స్‌లో కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు.


కేటీఆర్ ప్రచార షెడ్యూల్:

  • అక్టోబర్ 31న షేక్‌పేట్

  • నవంబర్ 1న రెహమత్ నగర్

  • నవంబర్ 2న యూసుఫ్‌గూడ

  • నవంబర్ 3న బోరబండ

  • నవంబర్ 4న సోమాజిగూడ

  • నవంబర్ 5న వెంకట్రావు నగర్,

  • నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్

  • నవంబర్ 8న షేక్‌పేట్, యూసుఫ్‌గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో‌ నిర్వహించనున్నారు.

  • ఇక చివరి రోజు నవంబర్ 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచారం ముగియనుంది.


వరుస సమావేశాలు...

మరోవైపు వరుస సమావేశాలతో కేటీఆర్ ఈరోజు (బుధవారం) బిజీబిజీగా గడుపనున్నారు. కుల సంఘాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం జరుగనుంది. తెలంగాణభవన్‌లో జరుగనున్న ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ, తెలంగాణకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు... ఐఎండీ హెచ్చరిక

ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్.. భద్రతా సిబ్బంది అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 01:57 PM