Share News

Hyderabad Rains: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో భారీ వర్షం..

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:00 PM

న‌గ‌ర ప్రజ‌లు ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్ మూత‌ల‌ను తెర‌వ‌కూడ‌దని జలమండలి అధికారులు సూచించారు. ఎమర్జెన్సీ కోసం జ‌ల‌మండ‌లి హెల్ప్ లైన్ 155313కి కాల్ చేయాల‌ని ఆయ‌న కోరారు. జంట జలాశయాల గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Hyderabad Rains: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో భారీ వర్షం..
Rain Alert

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నగరంలో కురుస్తున్న వర్షం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తరచూ.. సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోల్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ముంపున‌కు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ద‌గ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. డీప్ మ్యాన్‌హోల్స్ ద‌గ్గర సీవ‌రేజి సూప‌ర్‌వైజ‌ర్లు ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.


న‌గ‌ర ప్రజ‌లు ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్ మూత‌ల‌ను తెర‌వ‌కూడ‌దని అశోక్ రెడ్డి సూచించారు. ఎమర్జెన్సీ కోసం జ‌ల‌మండ‌లి హెల్ప్ లైన్ 155313కి కాల్ చేయాల‌ని ఆయ‌న కోరారు. జంట జలాశయాల గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నగరంలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి.


హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, గాంధీనగర్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురా, బీఎన్‌రెడ్డినగర్‌, మీర్‌పేట్‌, బాలాపూర్‌, బడంగ్‌పేట్‌, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్‌, జవహర్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడలో వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

United Aircraft Corporation: భారత్‌లో పౌర విమానాల తయారీ

Lufthansa Flight Incident: లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ

Updated Date - Oct 29 , 2025 | 12:28 PM