KTR On CJI Attack: సుప్రీం సీజేఐపై దాడి.. కేటీఆర్ ఏమన్నారంటే
ABN , Publish Date - Oct 07 , 2025 | 09:23 AM
మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని... దీనికి నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతమని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 7: సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై (Chief Justice BR Gavai) దాడికి యత్నించటాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రజాస్వామ్య మూలాలపై దాడి అంటూ వ్యాఖ్యానించారు. ఇది వ్యక్తిపై దాడి కాదని... వ్యవస్థపైనే దాడి అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ ట్వీట్...
‘మన దేశంలో అసహనం (intolerance) అత్యున్నత స్థాయికి చేరుకుంది. దీనికి నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (CJI) గవాయిపై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతం. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన ఈ సిగ్గుచేటైన దాడి కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ఆ వ్యవస్థపైనే జరిగిన దాడి. విశ్వాసం (faith) (మతం) వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి విభేదం ఉన్నా కూడా హింసను సమర్థించదు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యం యొక్క మూలాలకే ముప్పు కలిగిస్తుంది’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.
కాగా... నిన్న సుప్రీంకోర్టులో ఎన్నడూ చూడని ఘటన చోటు చేసుకుంది. ఏకంగా సీజేఐపైనే దాడికి యత్నించారు. అది కూడా నల్ల కోటు ధరించిన లాయరే. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదంటూ లాయర్ నినాదాలు చేశారు. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసనకు దిగారు సదరు న్యాయవాది. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని లాయర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మూడు గంటల తర్వాత అతడిని విడిచి పెట్టగా... బార్ కౌన్సిల్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు.
ఇవి కూడా చదవండి..
డ్రైవింగ్‌లో ఇలా చేయడం డేంజర్.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
కాంగ్రెస్‌కు షాక్.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతపై క్రిమినల్ కేసు
Read Latest Telangana News And Telugu News