HYD IT Raids: DSR గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో ఐటీ సోదాలు..
ABN , Publish Date - Aug 19 , 2025 | 08:32 AM
DSR గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీతో పాటు కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు తమదైనా తీరు ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్థులు, సినిమా పెద్దలు అని తేడా లేకుండా సోదాలు నిర్వహిస్తూ.. దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి ఐటీ అధికారులు నగరంలో వారి పంజా విసిరారు. DSR గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో ఐటీ సోదాలు చేస్తున్నారు. కంపెనీ టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు.
DSR గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీతో పాటు కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల పన్నుల చెల్లింపులపై కంపెనీ యాజమాన్యాన్ని ఆరా తీస్తున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , SR నగర్ , సురారంలో సోదాలు కొనసాగుతున్నాయి. CRPF బలగాల మధ్య సోదాలు జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే తెలంగాణతో పాటు DSR గ్రూప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించి ఏపీ, కర్ణాటకలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏకకాలంలో 30 చోట్ల సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం