Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు.. పట్టించుకోని సిబ్బంది
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:55 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దాదాపు వెయ్యి మందికిపైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. దాదాపు 12 గంటల పాటు వీరంతా ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు.
హైదరాబాద్, డిసెంబర్ 03: ఇండిగో సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిరీక్షిస్తున్నారు. మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కేరళకు బయలుదేరాల్సిన విమానాల్లో ఒక్కసారిగా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఈ విమానాలను రద్దు చేసింది. దీంతో గమ్యస్థానాలు చేరుకోవాల్సిన దాదాపు 1000 మంది ప్రయాణికులు.. గత రాత్రి నుంచి ఈ ఎయిర్ పోర్ట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు.
మరోవైపు శబరిమల వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న దాదాపు 200 మందికిపైగా స్వాములు సైతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ఇక ఈ విమానాల రాకపోకలపై ఇండిగో సిబ్బంది ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఈ సంస్థ సిబ్బంది తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికుల్లో చిన్నారులు సైతం ఉన్నారని.. వారిని సైతం ఎవరూ పట్టించుకోలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక్క రోజు పళ్లు తోముకోకపోతే ఇంత డేంజరా..?
వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడు.. స్పందించిన సీఎం
For More TG News And Telugu News