Share News

HMWSSB: నగరంలో ఈ ప్రాంతాల్లో నిలిచిపోనున్న మంచినీటి సరఫరా..

ABN , Publish Date - Nov 24 , 2025 | 06:42 PM

హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. నవంబర్ 26వ తేదీన.. ఒక్క రోజు పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా ఆగనుంది.

HMWSSB: నగరంలో ఈ ప్రాంతాల్లో నిలిచిపోనున్న మంచినీటి సరఫరా..

హైదరాబాద్, నవంబర్ 24: హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్ 1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 26వ తేదీన నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీనరేజ్ బోర్డు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు.


చార్మినార్, వినయ్ నగర్, బొజగుట్ట, రెడ్ హిల్స్, నారాయణ గూడ, ఎస్ ఆర్ నగర్, మారేడ్ పల్లి, రియాసత్ నగర్, కూకట్‌పల్లి, సాహెబ్ నగర్, హయత్ నగర్, సైనిక్ పురి, ఉప్పల్, హఫీజ్ పేట్, రాజేంద్ర నగర్, మణికొండ, బోడుప్పల్, మీర్ పేట్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుందని వివరించారు. విద్యుత్ బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న టాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఒక్క రోజు మంచి నీటి సరఫరా నిలిచిపోతుందని ఉన్నతాధికారులు వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల నెరవేరబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More TG News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 06:47 PM