Hyderabad IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 10:46 AM
కొండాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్‌లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 7: భాగ్యనగరంలో మరోసారి ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు (మంగళవారం) ఉదయం కొండాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కొండాపూర్ అపర్ణ హోమ్స్‌లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. ఇటీవల కాలంలో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. పన్ను చెల్లింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న సమాచారం మేరకు కొద్దిరోజుల క్రితం ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. బంగారం కొనుగోలు పన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఐటీ ఆఫీసర్స్ సోదాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు షాక్.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతపై క్రిమినల్ కేసు
సుప్రీం సీజేఐపై దాడి.. కేటీఆర్ ఏమన్నారంటే
Read Latest Telangana News And Telugu News