Share News

Hyderabad: డీజే మోగిస్తున్నారా.. ఇది చూడాల్సిందే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:26 AM

సంక్రాంతి వేడులక సందర్భంగా పతంగులు ఎగురవేసేటప్పుడు డీజే శబ్దాలు శృతి మించకూడదని నగర సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో డీజే ఏర్పాట్లు చేసేవాళ్లు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని, నిబంధనల మేరకే డీజే వినియోగం ఉండాలన్నారు.

Hyderabad: డీజే మోగిస్తున్నారా.. ఇది చూడాల్సిందే..
DJ System

హైదరాబాద్‌, జవనరి 10: సంక్రాంతి వేడులక సందర్భంగా పతంగులు ఎగురవేసేటప్పుడు డీజే శబ్దాలు శృతి మించకూడదని నగర సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో డీజే ఏర్పాట్లు చేసేవాళ్లు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని, నిబంధనల మేరకే డీజే వినియోగం ఉండాలన్నారు. అంతేకాకుండా రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు డీజే వినియోగంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం పారిశ్రామిక వాడల్లో ఉదయం 75 నుంచి 70 డెసిబల్స్‌ వరకు, వాణిజ్య ప్రాంతాల్లో 65 నుంచి 55 డెసిబల్స్‌ వరకు, జనావాసాల్లో 55 నుంచి 45 డెసిబల్స్‌ వరకు, సెలెంట్‌ జోన్‌లో 50 నుంచి 40 డెసిబల్స్‌కు శబ్దాలు మించకూడదన్నారు. ఈ ఆంక్షలు జనవరి 13 నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. పతంగులు ఎగరవేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చైనా మాంజా వినియోగించకూడదన్నారు.


Also Read:

అత్త మాస్టర్ ప్లాన్.. కోడలిని ఘోరంగా..

మాజీ సీఎం బంధువు ఇళ్లల్లో ఐటీ తనిఖీలు

చెవిరెడ్డికి బిగ్ షాక్..

For More Telangana News and Telugu News..

Updated Date - Jan 10 , 2025 | 11:26 AM