Share News

CP Sajjanar: చిరంజీవి డీప్‌‌ఫేక్ కేసు.. సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:38 PM

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి.

CP Sajjanar: చిరంజీవి డీప్‌‌ఫేక్ కేసు.. సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు
CP Sajjanar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేసిన డీప్‌‌ఫేక్ కేసుపై విచారణ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. చిరంజీవి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీప్‌‌ఫేక్ కేసు విషయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీప్‌ఫేక్ మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇలాంటి డీపీఫేక్ సెలబ్రిటీల కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని ఆయన వెల్లడించారు. చాదర్‌ఘాట్ కాల్పుల కేసులో కూడా పురోగతి ఉందని స్పష్టం చేశారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.


మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. దీనిపై ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టను సైతం ఆశ్రయించటంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన పేరును దెబ్బతీసేలా డీప్‌ఫేక్‌ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మెగాస్టార్ చిరంజీవి కోరారు.


ఇవి కూడా చదవండి..

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

Updated Date - Oct 27 , 2025 | 03:06 PM