Share News

Hyderabad Charlapally Incident: చర్లపల్లిలో మిస్టరీ డెత్ కలకలం.. గోనె సంచిలో మహిళ మృతదేహం

ABN , Publish Date - Sep 20 , 2025 | 08:13 PM

హైదరాబాద్ చర్లపల్లి పీఎస్ పరిధిలో మృతదేహం కలకలం రేపుతోంది. రైల్వేస్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం గోనె సంచిలో లభ్యమైంది.

Hyderabad Charlapally Incident: చర్లపల్లిలో మిస్టరీ డెత్ కలకలం.. గోనె సంచిలో మహిళ మృతదేహం
Hyderabad Charlapally Incident

హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మిస్టరీ మరణం కలకలం రేపుతోంది. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో గోనె సంచిలో ఉన్న ఒక మహిళ మృతదేహం వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.


చర్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పాత గోడ వద్ద అనుమానాస్పదంగా గోనె సంచి కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని సంచిని తెరిచి చూడగా అందులో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీఆర్పీ, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో హత్య చేసిన వారి కోసం ఆధారాలు సేకరిస్తున్నారు.


మృతురాలి వయస్సు సుమారుగా 25–35 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా రైల్వేస్టేషన్ లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడు మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టుకుని రైల్వేస్టేషన్ లోకి వచ్చిన దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బాధితురాలిని హత్య చేసి అనంతరం ఆమెను సంచిలో పెట్టి రైల్వేస్టేషన్ దగ్గర పడేసినట్లు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రిపోర్ట్ ఆధారంగా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. కాగా, ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Also Read:

పీపీపీ విధానంపై చర్చకు రా.. జగన్‌కు మంత్రి సత్యకుమార్ స్ట్రాంగ్ సవాల్

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్

For More Latest News

Updated Date - Sep 20 , 2025 | 08:27 PM