Hyderabad Father Incident: దారుణం.. మూడేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి
ABN , Publish Date - Sep 14 , 2025 | 09:24 AM
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న మూడేళ్ల కుమారుడిని తండ్రి హత్య చేసి..
హైదరాబాద్: మానవత్వం మంటగలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడేళ్ల చిన్న కుమారుడిని ఓ తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ నూరినగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్ (35), ఆయన భార్య సనాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు అనాస్ (3) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ నేపథ్యంలో తన కుమారుడిని హత్య చేయాలని అక్బర్ ప్లాన్ చేశాడు. శుక్రవారం రాత్రి, భార్య విధులకు వెళ్లిన సమయంలో, దిండుతో చిన్నారిని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి, మూసీ నదిలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని మొదటిగా ఎవరికీ అనుమానం రాకుండా నటించాడు. తరువాత, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, తండ్రిని గమనించిన పోలీసులు, అతడిపై అనుమానంతో గట్టిగా ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. చివరకు తానే కుమారుడిని హత్య చేసినట్లు తండ్రి అంగీకరించాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్ అక్బర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహం కోసం రక్షణ బలగాలు మూసీలో గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read:
డ్రైవర్‌కు గుండెపోటు.. గాల్లోకి ఎగిరిన కారు.. షాకింగ్ వీడియో వైరల్..
విటమిన్ డి3 లోపం.. ఈ ఆహారాలతో నివారించండి.!
For More Latest News