ADE Ambedkar:హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు.. రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 09:49 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏడీఈ ఏరుగు రవీందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏడీఈగా విధులు నిర్వహిస్తూ.. ఏరుగు అంబేద్కర్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. అతడు.. తన బినామీలను ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయిలు సంపాదించినట్లు ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.300 కోట్లు అతడు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
మంగళవారం ఉదయం నుంచి 11 ఏసీబీ బృందాలు.. ఏరుగు అంబేద్కర్ నివాసం, ఆయన బంధువులు, ఆయన కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఆ క్రమంలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు కనుగొన్నారు. దీంతో ఏరుగు అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక ఏడీఈ అంబేద్కర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..
ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తులు రూ. 200 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తింపు
మంగళవారం ఉదయం నుంచి 11 ప్రాంతాల్లో సోదాలు చేసి అంబేద్కర్‌ను ఏసీబీ అరెస్టు
బినామీ సతీష్ ఇంట్లో రూ. 2.58 కోట్ల రూపాయల నగదు లభ్యం.
ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో నగదు దొరకడం ఇదే తొలిసారి.
ప్రభుత్వ అధికారిగా ఉంటూ కెమికల్ ఫ్యాక్టరీ నెలకొల్పిన అంబేద్కర్. సూర్యాపేటలో AMTHAR కెమికల్స్ పేరిట రెండు ఏళ్ల క్రితం ఏర్పాటు.
AMTHAR కెమికల్స్ పేరుతో ఇథనాల్ తయారీ, కంపెనీ డైరెక్టర్‌గా అంబేద్కర్.
బినామీలతోనే అధిక పనులు చేయించిన అంబేద్కర్. బినామీలకు కాంట్రాక్టులు పనులు ఇప్పించే పనులు మొత్తం తానే చూసుకున్న అంబేద్కర్.
కొద్ది నెలల క్రితమే అంబేద్కర్‌పై విజిలెన్స్ విచారణ.
గతంలో జీహెచ్ఏంసీలో ఏఈగా పనిచేసిన అంబేద్కర్.
డిస్కంలో పటాన్‌చెరువు, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలిలో పని చేయటంతో అధిక మొత్తంలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు.
ఐటీ కారిడార్‌లో హై రైజ్ బిల్డింగ్‌లకు విద్యుత్ కనెక్షన్ల జారీ సమయంలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులు.
కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదంటూ సాకు చెబుతూ వారి వద్ద నుండి రూ. కోట్లలో లంచం తీసుకున్నట్టు ఆరోపణ.
పలుమార్లు అంబేద్కర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
వట్టినాగులపల్లిలో వివాదంలోనున్న వెంచర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. వాటిని అంబేద్కర్ బేఖాతరు చేసినట్లు ఫిర్యాదులు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్.. రిమాండ్ విధించిన కోర్టు
చరిత్ర మరవని రోజు.. సెప్టెంబర్ 17
Read Latest Telangana News and National News