Share News

ADE Erugu Ambedkar Arrest: ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్.. రిమాండ్ విధించిన కోర్టు

ABN , Publish Date - Sep 17 , 2025 | 08:21 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుతు శాఖ ఏడీఈ ఏరుగు అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

ADE Erugu Ambedkar Arrest: ఏడీఈ అంబేద్కర్ అరెస్ట్.. రిమాండ్ విధించిన కోర్టు
ADE Erugu Ambedkar Arrest

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుతు శాఖ ఏడీఈ ఏరుగు అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అంబేద్కర్‌కు 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని చంచల్‌గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు. హైదరాబాద్‌లోని మణికొండ, నార్సింగ్ ప్రాంతాల్లో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న ఏరుగు అంబేద్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.


ఈ నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు.. పలు బృందాలుగా విడిపోయి.. ఆయన నివాసం, అతడి బంధువుల ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ అక్రమంగా రూ. 300 కోట్లు మేర ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 10 ఎకరాల్లో భారీ కంపెనీ ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు.


అలాగే శేరిలింగంపల్లిలో అధునాతన భవనం, నగరంలో ఆరు ఇళ్ల స్థలాలు, హైదరాబాద్‌ శివారులో ఫామ్‌హౌస్‌ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. అంబేద్కర్‌ బినామీ సతీష్ ఇంట్లో రూ.2.18 కోట్ల నగదును సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏరుగు అంబేద్కర్‌ను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

సిందూర్‌ తో మసూద్‌ కుటుంబం చిన్నాభిన్నం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 17 , 2025 | 09:29 AM