10th Class Student: తల్లిదండ్రులు మందలింపు.. విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 25 , 2025 | 10:17 AM
పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయంటూ ఆమెను తల్లిదండ్రులు మందలించారు. దాంతో ఆ బాలిక ఈ దారుణానికి ఒడిగట్టింది.
హైదరాబాద్, నవంబర్ 25: పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో 10వ తరగతి విద్యార్థిని శ్రీ వైష్ణవి తీవ్ర మనస్థాపానికి గురై.. ఆపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని హబ్సిగూడలో జరిగింది. విద్యార్థిని ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శ్రీవైష్ణవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆమె తల్లిదండ్రుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. హబ్సిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో శ్రీవైష్ణవి చదువుతోందని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News