Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 25 , 2025 | 08:44 AM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఈ ఎన్నికల్లో సైతం గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాల వారీగా గెజిట్‌ను కలెక్టర్లు ప్రచురించారు. ఆ వివరాలు పంచాయతీ రాజ్ శాఖకు అందాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ వివరాలతో కూడిన గెజిట్ ప్రతులు చేరాయి. డిసెంబర్‌లో మూడు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే చీరలు పంపిణీతోపాటు వడ్డీ లేని రుణాల అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే మహిళలకు చీరల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో నగదును మంగళవారం జమ చేయనున్నారు.
ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే ఉత్సాహంతో పంచాయతీ ఎన్నికల్లో సైతం గెలుపొందాలని కేడర్‌ను ఆ పార్టీ నేతలు సమాయత్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. బీజేపీ సైతం అదే బాటలో సాగుతోంది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పురుషుల్లో ఆండ్రోపాజ్.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడ వచ్చంటే..?
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News