Share News

Mens Andropause: పురుషుల్లో ఆండ్రోపాజ్.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడ వచ్చంటే..?

ABN , Publish Date - Nov 25 , 2025 | 09:50 AM

మహిళల్లో మోనోపాజ్ ఉన్నట్లే పురుషుల్లో సైతం ఒక దశ ఉంటుంది. దీని గురించి చాలా మందికి అంతగా తెలియదు. ఇంకా చెప్పాలంటే పురుషుల్లోనే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ సమయంలో పురుషుల్లో సైతం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Mens Andropause: పురుషుల్లో ఆండ్రోపాజ్.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడ వచ్చంటే..?

మహిళల్లో మోనోపాజ్ దశ ఉన్నట్లే పురుషుల్లో సైతం ఒక దశ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. అదే ఆండ్రోపాజ్. పురుషుల వయస్సు పెరిగే కొద్ది టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఈ విషయంపై మగవారు ఎవరూ అంతగా మాట్లాడరు. కానీ దీనిని నిర్లక్ష్యం చేస్తే బాధపడతారని మగవారికి వైద్యులు సూచిస్తున్నారు.


లైంగిక ఆసక్తి..

ఆండ్రోపాజ్ ప్రారంభమైన తర్వాత.. తొలుత శరీరంపై దాని ప్రభావం పడుతుంది. ఎంత నిద్ర పోయినా.. ఏమి అనిపించదు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఫ్రెష్ అనిపించదు. గతంలో లాగా బాగా పని చేయలేరు. ఒక వేళ జిమ్‌కు వెళ్లినా.. ఆరోగ్యం మెరుగుపడటానికి కొంత సమయం పడుతుంది. అంతేకాకుండా కుటుంబంపైన లేదా లైంగిక ఆసక్తిపైన ఆసక్తి తగ్గుతుంది.


కారణంగా లేకుండా కోపం, చిరాకు..

తీవ్రంగా అలసిపోవడమే కాకుండా.. మనస్సు అస్థిరంగా ఉంటుంది. అకస్మాత్తుగా చిరాకు, విసుగు, నిరాశ పెరుగుతాయి. చాలా మంది పురుషులు ఈ బాధను వ్యక్తపరచ లేకపోతారు. నాదేం తప్పు అంటూ కుటుంబ సభ్యులను ఎదురు ప్రశ్నిస్తారు. ఈ తరహా వైఖరితో కుటుంబ సభ్యులనే కాదు.. బంధువుల మధ్య సంబంధాలు సైతం సన్నగిల్లుతాయి.


వ్యర్థం అనే భావన..

టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోయినప్పుడు.. ఆత్మవిశ్వాసం సైతం తగ్గిపోతుంది. తన చేతుల్లో ఏమీ లేదని.. గతంలో లాగా తాను లేనని భావిస్తు ఉంటారు. దీనిని మిడ్ లైఫ్ సంక్షోభమని పేర్కొంటారు. ఈ దశలో సందేహాలు తలెత్తడం ప్రారంభమవుతుంది. దీనిని అస్థిర స్థితిగా చెబుతారు.


కుటుంబంలో ఘర్షణలు..

భర్త నిత్యం మౌనంగా.. కోపంగా ఉంటే భార్య ఏమనుకుంటుంది? ఆమె తప్పుగా భావించుకుంటుంది. ఆయన.. తనను ప్రేమించడం లేదని అనుకుంటుంది. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఇది అతని తప్పు కాదు.. ఇది కేవలం హార్మోన్ల మాయాజాలం వల్ల ఇలా జరుగుతుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ కారణంగా.. కుటుంబంలో అనవసరమైన ఘర్షణలకు కారణమవుతుంది.


ఇది వ్యాధి కాదు..

దీనిని దాచి పెట్టే బదులు.. దీనిపై బహిరంగంగా మాట్లాడాలి. మహిళల్లో మోనోపాజ్ ఉన్నట్లే పురుషుల్లో ఆండ్రోపాజ్ ఉంటుందని గమనించాలి. అదీకాక ఇది మీ వ్యక్తిగత వైఫల్యం కాదని.. అర్థం చేసుకుంటే సగానికి సగం టెన్షన్ తగ్గుతుంది. అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదనే విషయాన్ని గ్రహించాలి.


పరిష్కార మార్గం..

ఇలాంటి సమయంలో కుటుంబంలో మద్దతు.. మరి ముఖ్యంగా భార్య అవగాహన చాలా ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలి. అవసరమనుకుంటే వైద్యుల కౌన్సెలింగ్ తీసుకోవాలి. తద్వారా మీ మనస్సు తెలికపడుతుంది. అలాగే ఇష్టమైన ఆహారాన్ని బాగా నమిలి తినాలి. శుభ్రంగా నిద్ర పోవాలి. నడవడం లేదా వ్యాయామం చేయడం మరి ముఖ్యం. మీ జీవనశైలిని మార్చుకుంటే.. ఈ ఆండ్రోపాజ్ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

పురుషుల్లో ఆండ్రోపాజ్.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడ వచ్చంటే..?

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More Health News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 10:00 AM