High Court On Bogus Votes: బోగస్ ఓట్లపై పిటీషన్.. హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:14 PM
ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది హైకోర్టు.
హైదరాబాద్, అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR), జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) వాదనలు ముగిశాయి. పిటిషన్లపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఎలక్టోరల్స్‌ను ఈసీ రివిజన్ చేస్తోందని.. ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది హైకోర్టు. ఓటో చోరీపై హైకోర్టులో బీఆర్‌ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈరోజు (గురువారం) విచారణ జరిగింది.
బీఆర్ఎస్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌తో సంబంధంలేని వారు ఓటరు జాబితాలో చేరారని తెలిపారు. బోగస్ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించామని వాదనలు వినిపించారు. ఈసీ తరపు లాయర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రిప్రజెంటేషన్‌లపై ఎన్నికల అధికారిని ఆదేశించామని.. నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్ట్ ధర్మాసనం బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.
ఇవి కూడా చదవండి...
మంత్రుల కేబినెట్ కాదు.. మాఫియా డాన్ల కేబినెట్: ఆర్ఎస్ ప్రవీణ్
కూలీపై పోలీసుల లాఠీ దాడి.. ఏం జరిగిందంటే
Read Latest Telangana News And Telugu News