Share News

Karimnagar Police Assault: కూలీపై పోలీసుల లాఠీ దాడి.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:54 PM

తాగిన మత్తులో బస్టాండ్‌ ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు పరుశురాంను అడ్డుకున్నారు. బస్టాండ్ ఆవరణలో మూత్రవిసర్జన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Karimnagar Police Assault: కూలీపై పోలీసుల లాఠీ దాడి.. ఏం జరిగిందంటే
Karimnagar Police Assault

కరీంనగర్, అక్టోబర్ 16: బస్టాండ్‌ ఆవరణలో మూత్ర విసర్జన చేశాడనే కారణంతో ఓ వ్యక్తిపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు సర్జరీ అని తేల్చడంతో బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు. ఇంతకీ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఎవరు.. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పరుశురాం అనే వ్యక్తి కూలీ పనులు చేస్తుంటాడు. అతడు మద్యానికి బానిసగా మారాడు. తప్పతాగి కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలో తాగిన మత్తులో బస్టాండ్‌ ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు పరుశురాంను అడ్డుకున్నారు. బస్టాండ్ ఆవరణలో మూత్రవిసర్జన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పరుశురాంపై లాఠీలతో దాడి చేశారు.


నలుగురు పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు చెబుతున్నాడు. అయితే పరుశురాం కూలీ పనులు చేస్తూ రోడ్లపైనే జీవనం సాగిస్తుంటాడు. తీవ్రంగా గాయపడిన పరుశురాంను స్థానిక ఆస్పత్రికి తరలించగా... పోలీసుల దాడిలో అతడి చెయ్యి విరిగిందని, వెంటనే సర్జరీ అవసరమని తేల్చారు వైద్యులు. దీంతో బాధితుడిని వన్‌టౌన్ పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో పరుశురాం చికిత్స పొందుతున్నాడు.


ఇవి కూడా చదవండి...

నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జరిగేది ఇదే: పీసీసీ చీఫ్

మంత్రుల కేబినెట్ కాదు.. మాఫియా డాన్ల కేబినెట్: ఆర్ఎస్ ప్రవీణ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 16 , 2025 | 03:55 PM