Share News

Harish Rao High Court Petition: హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్

ABN , Publish Date - Sep 18 , 2025 | 08:22 PM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.

Harish Rao High Court Petition: హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్
Harish Rao High Court Petition

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హరీష్ రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హరీష్ రావుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైంది.


అయితే, కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై ఫిర్యాదు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP)ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం

చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 08:26 PM