Newly Married Couple: వివాహమైన జస్ట్ 48 గంటలకే..
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:19 PM
బడంగ్‌పేట్ లక్ష్మీ దుర్గా నగర్ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్ వివాహం జులై 7వ తేదీన పెళ్లి కుమార్తె ఇంట ఘనంగా జరిగింది. జులై 8వ తేదీ తెల్లవారుజామున వధువుతోపాటు తన ఇంటికి సాయి అనిల్ కుమార్ చేరుకున్నారు.
హైదరాబాద్, ఆగస్ట్ 11: ప్రస్తుత జీవన శైలి కారణంగానో.. లేకుంటే తీసుకుంటున్న ఆహారం కారణంగానో.. నేడు గుండె జబ్బు సమస్యలు సర్వ సాధారణమై పోయాయి. ఈ జబ్బులు అసలు వయస్సుతో సంబంధం లేకుండా వచ్చేస్తు్న్నాయి. దీంతో అతి చిన్న వయస్సులోనే విద్యార్థులు గుండె పోటుతో మరణిస్తు్న్నారు. ఇంకా చెప్పాలంటే.. క్రికెట్ ఆడుకుంటున్న బాలురు ఆకస్మాతుగా వచ్చిన గుండె పోటుతో ఆట స్థలంలోనే కుప్పకూలి పోతున్నారు. ఈ సంఘటనలు కోకొల్లలు. అలాగే వివాహ వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ.. వరుడు నిట్టనిలువునా కూలిపోయి ఘటనలు చాలానే ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి.
దాదాపుగా ఇటువంటి సంఘటన ఇటీవల రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ లక్ష్మీ దుర్గా నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఈ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్ వివాహం జులై 7వ తేదీన పెళ్లి కుమార్తె ఇంట జరిగింది. జులై 8వ తేదీ తెల్లవారుజామున వధువుతోపాటు తన ఇంటికి సాయి అనిల్ కుమార్ చేరుకున్నారు. ఆ వెంటనే అతడికి తీవ్ర గుండె పోటు వచ్చింది. ఇంట్లోనే అతడు కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి.. అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించారు.
వివాహం జరిగి జస్ట్ 2 రోజులకే వరుడు మృతి చెందడంతో.. ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉద్యోగం చేస్తున్న అనిల్‌కు వివాహం చేస్తే.. ఒక ఇంటి వాడు అవుతాడని తామంతా భావించామంటూ అతడి తల్లిదండ్రులతోపాటు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఇలా తిరిగి రానీ లోకాలకు పయనమవుతాడని తాము అస్సలు ఊహించ లేదని వారు చెబుతున్నారు. ఇంటి గుమ్మాలకు కట్టిన మామిడి ఆకులు వాడి పోకమునుపే.. తమ కుమారుడికి నిండు నూరేళ్లు నిండిపోయాయంటూ ఆ కన్న తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు స్థానికులతోపాటు బంధువులను తీవ్రంగా కలిచి వేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ విలీనంపై కేసీఆర్ అత్యవసర సమావేశం..!
కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది
For Telangana News And Telugu News