Women: మహిళలకు శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్..
ABN , Publish Date - Jul 13 , 2025 | 09:22 PM
ఆషాఢ మాసం కొనసాగుతోంది. అందునా బోనాల పండుగ జరుగుతోంది. అలాంటి వేళ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్, జులై 13: తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి వడ్డీ రాయితీ నగదు జమ చేయాలని నిర్ణయించింది. అందుకోసం రూ. 344 కోట్లు విడుదల చేసింది. జులై 18వ తేదీ లోపు ఈ నగదు వారివారి ఖాతాల్లో జమ కానుంది. గ్రామీణ ప్రాంతాల సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంతాల సంఘాలకు రూ. 44 కోట్లు కేటాయించింది.
వడ్డీ రాయితీ నిధులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పంపిణీ చేస్తారు. అలాగే మహిళా సంఘాల సభ్యులు, రుణ, ప్రమాద బీమా పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. రానున్న ఐదేళల్లో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.
ఈ నగదు జమయ్యే లోపు ప్రజా ప్రతినిధుల ద్వారా మండలాలు, గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి పేరుతో కార్యక్రమాలు నిర్వహించి చెక్కులు పంపిణీ చేస్తోంది. జులై 12 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వడ్డీ రాయితీ నగదుకు సంబంధించిన చెక్కులను నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పంపిణీ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
అమరావతి భూ కేటాయింపులపై సంచలన నిర్ణయం
తెలంగాణలో కవితను తిరగనీయం: తీన్మార్ మల్లన్న
Read Latest Telangana News And Telugu News