GHMC: హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్.. 90 శాతం డిస్కౌంట్
ABN , Publish Date - Mar 07 , 2025 | 09:11 PM
GHMC: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహానగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. 150 గజాల జాగాకు ఉన్న వారు కేవలం ఏడాదికి రూ. 50 పన్ను కింద జీహెచ్ఎంసీకి చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. నెలకు కొన్ని వేల లీటర్ల మంచి నీరు ఉచితమని ప్రకటించింది.

హైదరాబాద్, మార్చి 07: హైదరాబాద్ మహానగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డిపై 90 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. మార్చి మాసాంతం వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వారికి ఈ ఆఫర్ వర్తిస్తోందని స్పష్టం చేసింది. కేవలం 10 శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తి పన్నును చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్‌మెంట్) ద్వారా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని భావిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మొండి బకాయిదారులకు ఓటీఎస్ ద్వారా బల్దియా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
Also Read: పరీక్ష పేపర్ లీక్.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహానగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. 150 గజాల జాగాకు ఉన్న వారు కేవలం ఏడాదికి రూ. 50 పన్ను కింద జీహెచ్ఎంసీకి చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. నెలకు కొన్ని వేల లీటర్ల మంచి నీరు ఉచితమని ప్రకటించింది. అందుకోసం నల్లా ఉన్న ప్రతి ఇంటికి వాటర్ మీటర్ అమర్చుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం దాదాపుగా పడిపోయింది. ఇలా ఇవే కాదు.. ఎన్నికల వస్తున్నాయంటే చాలు.. అధికారం అందుకోనే క్రమంలో రాజకీయ పార్టీ ఏదో ఒక పథకాన్ని ప్రజల ముందుకు తీసుకు వస్తుంది. అలా అధికారాన్ని హస్తం గతం చేసుకుని ఐదేళ్ల పాటు పాలన సాగిస్తుంది.
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
అందు కోసం పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఇదే తరహా విధి విధానాలకు ప్రతి రాజకీయ పార్టీ అనుసరిస్తున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వాల వద్ద నిధుల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నగదు ప్రభుత్వానికి చేరాలి. అవి మళ్లీ ప్రజా ప్రయోజనార్థం వినియోగించాలి. కానీ ఉచిత హామీలు, పథకాల కారణంగా.. ప్రజల పన్నుల రూపంలో నగదు చెల్లించడం లేదు. దీంతో గద్దె నెక్కిన పాలకులు.. రుణాల కోసం కేంద్రం వద్దకో.. ఇతర దేశాలకో వెళ్లి యాచించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
అదీకాక హైదరాబాద్ మహానగరంలో కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు సైతం వెలగడం లేదు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. ఇటీవల కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో వీధి దీపాలు వెలగడం లేదంటూ కేంద్ర మంత్రి దృష్టికి స్థానికులు తీసుకు వెళ్లారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులను వెంటనే పిలిపించి.. స్థానికుల సమస్యను వారి ముందు కేంద్ర మంత్రి ఉంచారు. కార్పొరేషన్ వద్ద నగదు లేదని.. అందువల్లే వీధి దీపాలు వెలగడం లేదంటూ వారు సాక్షాత్తూ కేంద్ర మంత్రికి సమాధానం ఇచ్చారు.
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
ఇలాంటి పరిస్థితుల్లో బకాయిదారులు చెల్లించే నగదుతో జీహెచ్ఎంసీని నడిపించేందుకు ఉన్నతాధికారులు సమాయత్తమవుతోన్నారు. అందులోభాగం మొండి బకాయిలను వసూల్ చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఈ ఓటీఎస్‌ను మరోసారి తెరపైకి తీసుకు వచ్చింది.
Also Read:వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
For Telangana News And Telugu News