Share News

GHMC: హీటెక్కిన జిహెచ్ఎంసి రాజకీయం.. బీఆర్ఎస్, బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే..

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:29 PM

జిహెచ్ఎంసి రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది.

GHMC:  హీటెక్కిన జిహెచ్ఎంసి రాజకీయం..  బీఆర్ఎస్, బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే..
GHMC

హైదరాబాద్: జిహెచ్ఎంసి రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మాన వ్యవహారం కాక రేపుతుంది. నేటితో GHMC ప్రస్తుత పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి కావడంతో ఏ క్షణంలోనైన మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ కార్పొరేటర్లకు దిశ నిర్ధేశం చేయనున్నారు.


ఇటీవల బీజేపీ కార్పొరేటర్లతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. రేపు మాజీ మంత్రి తలసాని బిఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. స్టాడింగ్ కమిటీలో పోటీ, మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పై BRS కార్పొరేటర్లతో తలసాని చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అవిశ్వాసం పెడితే తాము తీర్మానం పెట్టి తీరుతామంటున్నారు బీజీపీ కార్పొరేటర్లు. ఎల్లుండి GHMC కాంగ్రెస్ కార్పొరేటర్లతో సిటీ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు.


ఇదిలా ఉంటే, స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నలుగురు కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి కూకట్‌పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి హిమాయత్ నగర కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప నామినేషన్లు దాఖలు చేశారు.

GHMC రిటర్నింగ్ అధికారికి కార్పొరేటర్లు తన నామినేషన్ పత్రాలను అందించారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నాలుగేళ్లుగా తమకు స్టాండింగ్ కమిటీలో చోటు లేదని.. ఈసారి తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పార్టీలకు అతీతంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా మాకు ఓటేస్తారంటున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.

Updated Date - Feb 11 , 2025 | 05:40 PM