KTR: ప్రధానంగా వాటిపైనే కేటీఆర్‌కు ఈడీ క్వశ్చన్స్..
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:54 PM
Formula E Case: ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్‌ను ఈడీ నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటిసారి కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. సాయంత్రం వరకు విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది ఈడీ. ఈ కార్ రేసు నిర్వాహణకు సంబంధించి రూ.55 కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదనే అంశంపై కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది.

హైదరాబాద్, జనవరి 16: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR).. ఈడీ (ED) విచారణ కొనసాగుతోంది. దాదాపు రెండున్నర గంటలకు కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు మాజీ మంత్రి విచారణ కొనసాగనుంది. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్‌ను ఈడీ నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటిసారి కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. సాయంత్రం వరకు విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది ఈడీ. ఈ కార్ రేసు నిర్వాహణకు సంబంధించి రూ.55 కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదనే అంశంపై కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది.
అలాగే కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపైన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. బదిలీ అయిన రూ.55 కోట్లు ఎఫ్‌ఈవో కంపెనీ నుంచి ఇతర అకౌంట్లకు ఏమన్నా బదిలీ అయ్యిందా అనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘హెచ్‌ఎండీఏ పాలకమండలి అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థకు పెద్ద మొత్తంలో నిధులు ఎలా చెల్లిస్తారు... ఈ రేసు నిర్వహణతో రూ.700 కోట్ల లాబం వచ్చిందని చెబుతున్నారని.. దానికి సబంధించిన లెక్కలు ఉన్నాయా.. రేసుకు సంబంధించిన ప్రకటనలతో ప్రభుత్వ సంస్థలకు ఏం లాభాలు వచ్చాయి. టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత’’ అంటూ కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ISRO: కొత్త ఏడాదిలో ఇస్రో సరికొత్త రికార్డ్..
అలాగే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ అయిన రూ.55 కోట్ల వ్యవహారంలో అధికారుల పాత్రపై ఇప్పటికే ఈడీ ఒక అంచనాకు వచ్చింది. అధికారులకు అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ ఆదేశాలు లేకుండానే నగదు బదిలీ అయిన నేపథ్యంలో కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డితో పాటు బ్యాంకు అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి.. ఇప్పటికే సిబ్బందిని విచారించారు. ఈ కేసులో బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే బ్యాంకు అధికారులపై కూడా కేసు నమోదు చేసి వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు
Formula E Case: ఈడీ విచారణకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News