Share News

KTR Visit Chilukur Temple: అర్చకుడు రంగరాజన్‌‌పై దాడి.. కేటీఆర్ ఏమన్నారంటే

ABN , Publish Date - Feb 10 , 2025 | 01:35 PM

KTR: చిలూకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌ను పరామర్శించారు. రంగరాజన్‌పై కొంతమంది దాడికి పాల్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రంగరాజన్‌ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.

KTR Visit Chilukur Temple: అర్చకుడు రంగరాజన్‌‌పై దాడి.. కేటీఆర్ ఏమన్నారంటే
Former minister KTR

హైదరాబాద్, ఫిబ్రవరి 10: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై (CS Rangarajan) రామరాజ్యం సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) తీవ్రంగా ఖండించారు. సోమవారం ఉదయం అర్చకుడు రంగరాజన్‌ను కేటీఆర్ కలిసి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ కుటుంబం సేవ చేస్తోందన్నారు. రంగరాజన్ పై దాడిని ఖండిస్తున్నామని.. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమంటూ మండిపడ్డారు.


రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయన్నారు. ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా.. ఏ జెండా పట్టుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చూసుకోవాలన్నారు. అవసరమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ వద్ద భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. రంగరాజన్‌ను అవమానించడం అంటే దేవుని అవమానించడమే అని అన్నారు. రంగరాజన్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

వివేకా హత్య కేసు.. హైకోర్టులో అవినాష్ రెడ్డి సవాల్


మరోవైపు రంగరాజన్‌పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రంగరాజన్‌పై దాడి ఘటనలో 17 మంది ఆచూకీని గుర్తించారు పోలీసులు. మొత్తం దాడి చేసిన వ్యక్తులు 22 మంది కాగా.. వారిలో 17 మందిని పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిమందిని గుర్తించారు. ఈ ఘటనలో వీర రాఘవ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే వీర రాఘవరెడ్డి అనుచరులు ఐదు మందిని ఈరోజు మొయినాబాద్ పోలీసులు.. అరెస్ట్ చేశారు. అలాగే పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


కాగా.. ఈ నెల 7న వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్‌ నివాసానికి చేరుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రాంగణంలోనే రంగరాజన్‌ నివాసం ఉంటుంది. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలన్నారు. అలాగే దేవాలయాన్ని తమకు అప్పగించాలని రంగరాజన్‌పై తీవ్ర ఒత్తడి తీసుకొచ్చారు. దీన్ని వ్యతిరేకించిన రంగరాజన్‌పై వీరరాఘవరెడ్డి, అతడి అనుచరులు దాడి చేశారు. దీనిపై రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 22 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

Minister Komatireddy: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం

Fire Accident.. పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 10 , 2025 | 01:40 PM