KTR ACB Question: కేటీఆర్ విచారణ.. ఏసీబీ ప్రశ్నలివే
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:36 PM
KTR ACB Question: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మూడు గంటలుగా మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు చెల్లించడంపై ఏసీబీ ఆరా తీస్తోంది.
హైదరాబాద్, జూన్ 16: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో (Formula E Car Race Case) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఏసీబీ (ACB) ముందు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ మాజీద్‌ఖాన్ విచారిస్తున్నారు. దాదాపు మూడు గంటలుగా మాజీ మంత్రి విచారణ కొనసాగుతోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్‌ఈవో కంపనీకి బదిలీ అయిన నగదుపై కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా క్రిప్టో కరెన్సీ రూపంలో నగదు చెల్లించడంపై ఆరా తీస్తోంది. ఈ ఫార్ములా కేసులో ఆరు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది.
ఏసీబీ ప్రశ్నలు..
1. ఎలాంటి లాభాపేక్ష లేనప్పుడు ఎఫ్‌ఈవోకు చెల్లించే చెల్లింపులపై ఎందుకు నిబంధనలు పాటించలేదు.
2. రేస్ నిర్వహణలో త్రైపాక్షిక అగ్రిమెంట్ ఎందుకు జరిగింది. త్రైపాక్షిక అగ్రిమెంట్‌లో ఎస్ నెక్స్ట్ జెన్ కంపనీని ఎందుకు చేర్చారు.
3. ఎస్ నెక్స్ట్ జెన్ రేసింగ్‌లో వారి పాత్ర ఏంటి .. ఎంత ఆదాయం వచ్చింది.
4. కేవలం 2 లక్షలు క్యాపిటల్‌తో ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి బాధ్యతలు ఎలా ఇచ్చారు.
5. ట్రై పార్టీ అగ్రిమెంట్‌కు నాలుగు నెలల ముందు ఏర్పాటు చేసిన కంపెనీకి బాధ్యతలు ఇవ్వడం వెనుక మతలబు ఏంటి.
6. ఈ కార్ రేసింగ్ నిర్వహణలో ఎస్ నెక్స్ట్ జెన్ చేర్చుకోవడం వలన ఇందులో క్విట్ ప్రోకో లేదా.
7. ఎస్ నెక్స్ట్ జెన్ నుంచి మీ పార్టీ 49 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో ఎందుకు చెల్లించినట్లు.
8. రూ.49 కోట్లు కూడా ఒక్కోసారి కోటి రూపాయలు ప్రకారం 49 సార్లు ఇవ్వడానికి కారణం ఏంటి.
9. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి అన్నప్పుడు ఎన్నో పేరు ప్రతిష్టలు కలిగిన కంపెనీలు ఉన్నప్పటికీ ఎందుకు ఆ కంపెనీలతో ఒప్పందం కుదరలేదు.
10. మొదటి కార్ రేసింగ్ సమయంలో నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అంటూ కేటీఆర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది.
నిలోఫర్ కేఫ్ మూసివేత
మరోవైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్దకు భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు చేరుకున్నారు. భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావడంతో నిలోఫర్ కేఫ్‌ను పోలీసులు మూసివేయించారు. బీఆర్ఎస్ శ్రేణులను బలవంతంగా తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులతో గులాబీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఐసీసీసీలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.
ఇవి కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News