Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. అమల్లోకి ఎన్నికల కోడ్..
ABN , Publish Date - Oct 06 , 2025 | 06:33 PM
జూబ్లీహిల్స్‌లో ఈనెల 11వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. 14వ తేదీన యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుందన్నారు.
హైదరాబాద్: జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా సికింద్రాబాద్ ఆర్డీవో ఉంటారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈనెల 21వ తేదీన నామినేషన్ లాస్ట్ డేట్ ఉంటుందని స్పష్టం చేశారు. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని వివరించారు. 24వ తేదీ నామినేషన్ల విత్ డ్రాకు చివరి అవకాశమని చెప్పుకొచ్చారు.
జూబ్లీహిల్స్‌లో నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. 14వ తేదీన యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 139 లొకేషన్స్‌లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కి 980 ఓటర్లు వస్తారని స్పష్టం చేశారు. 2,400 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారని వివరించారు. మొత్తం 4 లక్షల ఓటర్లున్నారని పేర్కొన్నారు. పోలింగ్‌కు సరిపడా EVMలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మొదటి లెవెల్ చెకింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ తప్పకుండా పాటించాలన్నారు. మీడియా కూడా ఎలాంటి ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేయవద్దని ఆయన కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు మరోసారి ఓటర్ ఐడీలను చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ సూచించారు.
పోలీసులు సిద్ధం : సజ్జనార్
మరోపైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హైదరాబాద్ నూతన సీపీ సజ్జనార్ మాట్లాడారు.. జూబ్లీహిల్స్ బై పోల్‌కి నగర పోలీసులు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. సెక్యూరిటీ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. లైసెన్సుడ్ గన్ హోల్డర్స్ తమ గన్స్‌ను సబ్మిట్ చేయాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేస్తామని సజ్జనార్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు