Share News

Hyderabad Drugs : బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు టెకీలు అరెస్ట్

ABN , Publish Date - Aug 03 , 2025 | 03:56 PM

రాష్ట్రమంతా సే నో టు డ్రగ్స్ అంటున్న కొందరి తీరు మాత్ర మారడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టిన డ్రగ్స్ వాడటం మాత్రం మానడం లేదు కొందరు వ్యక్తులు.

Hyderabad Drugs : బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు టెకీలు అరెస్ట్
Software Techies Arrested

హైదరాబాద్, ఆగస్ట్ 03: రాష్ట్రమంతా సే నో టు డ్రగ్స్ అంటున్న కొందరి తీరు మాత్ర మారడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టిన డ్రగ్స్ వాడటం మాత్రం మానడం లేదు కొందరు వ్యక్తులు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాసాలకు అలవాటుపడి కొందరు టెకీలు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. తాజాగా మారోసారి నగరంలో డ్రగ్స్ కలకలం రేపాయి.


చేవెళ్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ (Drugs) మరోసారి కలకలం రేపాయి. ఓ ఫామ్‌హౌస్‌లో ఐటీ ఉద్యోగులు బర్త్ డే పార్టీ(Birth Day party) నిర్వహించారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్(Drugs) వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఫామ్ హౌస్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో రెండు లక్షల విలువైన డ్రగ్స్, ఖరీదైన మద్యం గుర్తించారు పోలీసులు. డ్రగ్స్, మద్యం బాటిళ్లతో పాటు రూ.50లక్షల విలువైన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు ఆరుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేసి, ఫామ్‌హౌస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


రాష్ట్రంలో డ్రగ్స్‌ నిషేధంపై ఎన్నాడు లేని విధంగా రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలని కంకణం కట్టుకుంది. తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో(Telangana Anti-Narcotics Bureau) స్థానంలో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్(Eagle) ఏర్పాటు చేసింది. ఈ కొత్త సంస్థ మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాలపై నిఘా మరియు అమలును ముమ్మరం చేసింది.


అయినప్పటికి రాష్ట్రంలో ఇప్పటకి కూడా ఎక్కడో ఓ చోట డ్రగ్స్ బయటపడుతునే ఉన్నాయి. దీనికి కారణం అధికారుల అసమానత్వమె కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే డ్రగ్స్ పట్టుబడుతున్న ఎక్కువ స్థలాలు చేవెళ్ల పరిధిలోని ఫామ్‌‌‌హోస్‌లే కావడం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి..

తొలి రోజు జైలులో ప్రజ్వల్ రేవణ్ణ..

ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 06:28 PM