Sandeep Reddy Meets CM Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
ABN , Publish Date - Aug 29 , 2025 | 05:56 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఆయనతో పాటు ఉన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు. భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఆయనతో పాటు ఉన్నారు.
సామాజిక బాధ్యతతో
భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున ఈ విరాళాన్ని అందజేయడం సామాజిక బాధ్యతలో భాగమని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ప్రజల సంక్షేమానికి సీఎం సహాయ నిధి చేస్తున్న కృషికి తమవంతుగా చిన్న బహుమానంగా ఈ విరాళాన్ని ఇచ్చినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు సామాజిక అంశాల్లో కూడా ముందుకు రావడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అభినందన వ్యక్తం చేసినట్లు సమాచారం.
సందీప్ రెడ్డి వంగా తెలుగు సినిమా దర్శకుడిగా ఎంతో గుర్తింపు పొందారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న ఆయన, సినిమా రంగంలో దూసుకెళ్తున్నారు.
Also Read:
టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర.. వీడియో బహిర్గతం
పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
For More Latest News