Kotamreddy Sridhar Reddy: టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర.. వీడియో బహిర్గతం
ABN , Publish Date - Aug 29 , 2025 | 05:00 PM
టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు స్కెచ్ వేసినట్లు ఒక వీడియో బహిర్గతమైంది. ఆయన్ని హత్య చేస్తే.. డబ్బే డబ్బు అంటూ సదరు వీడియోలో రౌడీషీటర్లు చర్చించుకోంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
నెల్లూరు, ఆగస్టు 29: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర పన్నినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేయాలని ఐదుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. ఈ హత్య మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్‌తోపాటు అతడి ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్లు తెలుస్తోంది. రౌడీషీటర్లు జగదీష్, మహేష్, వినీత్‌తోపాటు మరో ఇద్దరు సదరు వీడియోలో విపరీతంగా మద్యం సేవించి ఈ ప్లాన్ గురించి చర్చించినట్లు సమాచారం.
అయితే ఈ హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని టీడీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా.. వైఎస్ వివేకా హత్య తరహాలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డిని అంతమొందించాలని కుట్రపన్నారనే చర్చలూ జరుగుతున్నాయి. ఈ సదరు వీడియో వ్యవహారం ఐదురోజుల కిందట పోలీసులకు తెలిసందని.. కానీ వారు స్పందించలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఇక ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే.. రానున్న ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమారిస్తే.. డబ్బే డబ్బులంటూ ఈ వీడియో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Also Read:
టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర.. వీడియో బహిర్గతం
పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
For More Andhrapradesh News