Delhi: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014పై కేంద్రమంత్రితో చర్చించిన డిప్యూటీ సీఎం..
ABN , Publish Date - Feb 08 , 2025 | 07:29 PM
వివిధ కార్పొరేషన్ల(SPV) ఋణ పునర్వ్యవస్థీకరణపై ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ని భట్టి కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.408.40 కోట్లు తిరిగి చెల్లించేలా పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ఆర్థికమంత్రిని ఢిల్లీ (Delhi) సఫ్దర్ జంగ్ రోడ్డులోని ఆమె అధికారిక నివాసంలో డిప్యూటీ సీఎం కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని భట్టి విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ఈ అంశాలకు సంబంధించి కేంద్రానికి రాసిన లేఖలను సైతం నిర్మలా సీతారామన్‌కు అందజేశారు.అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పలు అంశాలపైనా చర్చ జరిగింది.
వివిధ కార్పొరేషన్ల(SPV) ఋణ పునర్వ్యవస్థీకరణపై ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ని భట్టి కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.408.40 కోట్లు తిరిగి చెల్లించేలా పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 విభాగం 94(2) ప్రకారం, వెనకబాటు జిల్లాల కోసం తెలంగాణకు ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని భట్టి కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని విభాగం 56(2) ప్రకారం, రూ.208.24 కోట్లు తెలంగాణకు తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాధ్యత మేరకు రావాల్సిన మొత్తానికి సంబంధించిన అంశంపైనా చర్చ సాగింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద నిధుల బదిలీ (Transfer of Funds) కోరుతూ కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రాయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: ట్రాఫిక్ సమస్యలకు వీరే కారణం.. కేసులు నమోదు చేస్తున్నా తీరు మారడం లేదు..
Election Commission: స్థానిక ఎన్నికల నగరా.. స్పీడ్ పెంచిన ఎన్నికల సంఘం