Share News

Hyderabad Drug Party: హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ... భారీగా డ్రగ్స్ స్వాధీనం

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:41 AM

హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Drug Party: హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ... భారీగా డ్రగ్స్ స్వాధీనం
Hyderabad Drug Party

హైదరాబాద్, నవంబర్ 4: సైబరాబాద్‌లో డ్రగ్స్ పార్టీని (Drugs Party) ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేవారు. హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు కన్జ్యూమర్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.


గుత్తా తేజ కృష్ణ ,సాజీర్, వెన్నెల రవి కిరణ్, మన్నే ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అలాగే పకనాటి లోకేష్ రెడ్డి, పృథ్వి విష్ణువర్ధన్, కార్ల పొడి వెస్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున అరెస్ట్ అయ్యారు. మేకల గౌతం, గుంటక సతీష్ రెడ్డిలను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో ఐటీ ఉద్యోగులు, ఆర్కిటెక్టులు, డ్రైవర్లు, డీజే ప్లేయర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. పట్టుబడిన వారి నుంచి 6 లక్షల 51 వేల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్ 31.2 గ్రాములు, 3 గ్రాముల గంజాయితో పాటు మొబైల్ ఫోన్లు, 2 బైకులు, డాంగిల్స్, జీపీఎస్ కార్డు రీడర్ స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

ఆ వాహనాల డ్రైవర్ల వేతనాలు చెల్లించాలి

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 01:31 PM