Congress Party MPs: పంపకాల్లో తేడా వచ్చింది అందుకే..: ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:59 PM
కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 02: కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. కల్వకుంట్ల కవితది కుటుంబ సమస్య, డబ్బులు సమస్య అని ఆయన అవర్ణించారు. కవిత సస్పెన్షన్ విషయం కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని అంశమని స్పష్టం చేశారు. పంపకాలలో తేడా వచ్చినందుకే కవిత మాట్లాడుతోందని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై పూర్తి విషయాలు బయట పెట్టాలంటూ కవితను ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఎందుకు ఉంటారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. హరీష్, సంతోష్ బాగోతాన్ని బయటపెట్టిందే సీఎం రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా ఎంపీ అనిల్ గుర్తు చేశారు.
ఇక ఇదే అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కవిత చెప్పిన విషయాలను సాక్ష్యంగా తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. 10 ఏళ్ల అవినీతి విషయాలను రాతపూర్వకంగా సీబీఐకి ఇవ్వాలని ఈ సందర్భంగా కవితకు ఆయన సూచించారు. తన కుటుంబంలో ఎవరెంత అవినీతి చేశారో కూడా బయట వచ్చి చెప్పాలంటూ కవితను ఆయన డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి కవితను తీసుకునేదే లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్ సహకారం మరువలేనిది: సీఎం చంద్రబాబు
రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో పేర్ని నాని ములాఖత్
For More TG News And Telugu News