Share News

Congress BRS Clash: వారి ముందే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ నినాదాలు

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:30 PM

Congress BRS Clash: సికింద్రాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

Congress BRS Clash: వారి ముందే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ నినాదాలు
Congress BRS Clash

హైదరాబాద్, జులై 12: సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy), సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు (MLA Padma Rao) ముందే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు (Congress, BRS Leaders) పోటా పోటీ నినాదాలు చేశారు. చెక్కులు పంపిణీ చేస్తుండగా స్టేజ్‌పై కరెంట్ కట్ చేశారు బీఆర్‌ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేతల తీరుపై వేం నరేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.


ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే పద్మారావు వివాదం సృష్టిస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పద్మారావు, కాంగ్రెస్ ఇంఛార్జ్ సంతోష్ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం నినాదాలు చేసుకున్నారు. దీంతో సికింద్రాబాద్ కట్టమైసమ్మకు సంబంధించిన బోనాలు వేడుక చెక్కుల పంపిణీ వివాదాస్పదంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం అన్నీ జరిగాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రోటోకాల్ కోసమే తప్ప ఎమ్మెల్యే అసలు తమకు అందుబాటులో ఉండటం లేదంటూ హస్తం నేతలు ఆందోళనకు దిగారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో వెంటనే పోలీసులు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు.


ఇవి కూడా చదవండి..

సీఎం రేవంత్ రాష్ట్రంలో ఉండేది తక్కువ.. ఢిల్లీలో ఎక్కువ: కవిత ఫైర్

రీసెర్చ్ సెంటర్‌ ప్రాంగణంలో చిరుతల కలకలం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 03:51 PM