Share News

Hyderabad Investments: సీఎం రేవంత్‌తో జర్మనీ బృందం భేటీ.. చర్చించిన అంశాలివే

ABN , Publish Date - Nov 04 , 2025 | 02:00 PM

హైదరాబాద్‌‌ను ఇన్నోవేషన్ హబ్‌గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను రేవంత్ కోరారు.

Hyderabad Investments: సీఎం రేవంత్‌తో జర్మనీ బృందం భేటీ.. చర్చించిన అంశాలివే
Hyderabad Investments

హైదరాబాద్, నవంబర్ 4: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను నేడు నగరంలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ జీసీసీ ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు సీఎంకు జర్మనీ బృందం వివరించింది.


revanth-germany1.jpg

హైదరాబాద్‌‌ను ఇన్నోవేషన్ హబ్‌గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను రేవంత్ కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. వీటితో TOMCOM ద్వారా వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని జర్మన్ బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ భేటీలో అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీపై డీసీపీ రియాక్షన్..

ఏం చేస్తారో చేసుకోండి.. సీఐతో వైసీపీ నేత దురుసు ప్రవర్తన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 05:40 PM