Today CM Revanth Cabinet Meeting: కేసీఆర్ విమర్శలు.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Dec 22 , 2025 | 10:06 AM
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శలు నేపథ్యంలో కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. అందుకోసం కేబినెట్‌తో ఆయన సోమవారం సమావేశం కానున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 22: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు సంధించిన నేపథ్యంలో వాటిని ఎలా తిప్పి కొట్టాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమయత్తమవుతున్నారు. అందుకోసం సోమవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. కేసీఆర్ విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై సైతం ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు డిసెంబర్ 27వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆ రోజు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ చేర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరుగు అన్నం మంచిదా..? మజ్జిగ అన్నం మంచిదా..?
తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష.. హాజరు కానున్న మంత్రులు
For More TG News And Telugu News