పెరుగు అన్నం చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది. శరీరానికి కావాల్సి పోషకాలు లభిస్తాయి.
కానీ పెరుగు అన్నం కంటే మజ్జిగ అన్నం తినడమే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. కండరాలను ఆరోగ్యంగా బలంగా.. దృఢంగా ఉంచుతుంది.
ఇందులో కాల్షియం సైతం మెండుగా లభిస్తుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి.
మజ్జిగ అన్నంలో విటమిన్ బి 12, లాక్టిక్ యాసిడ్ లభిస్తాయి. పొట్ట సమస్య రాకుండా చేస్తుంది.
మజ్జిగ అన్నం తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ చర్మ కణాలను పునరుత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది.
దీని వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముడతలు తగ్గి.. యవ్వనంగా ఉంటారు.
మజ్జిగ తాగితే చర్మం మృదువుగా మారుతుంది. మజ్జిగ అన్నం తింటే ముఖం మెరుస్తుంది.
ఈ అన్నం తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. చిన్న పిల్లలు ఈ అన్నం తీసుకోవడం వల్ల వారి ఎదుగుదల సవ్యంగా ఉంటుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
మజ్జిగ అన్నం తినడం వల్ల గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. మజ్జిగలో పొటాషియం.. రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. తల నొప్పి తగ్గుతుంది.
ఈ అన్నం తినడం వల్ల శరీరానికి చల్లదనం కలుగుతుంది. వేసవి కాలంలో మజ్జిగ అన్నం తినడం చాలా మంచిది. బాడీ కూల్ చేయడంతోపాటు శరీరాన్ని డీహైడ్రేషన్‌కి గురి కాకుండా చేస్తుంది.
మజ్జిగ అన్నం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.