ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది, ఇది అధికంగా తినకుండా నిరోధిస్తుంది.

విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

లోటస్ రూట్‌లో ఉండే పొటాషియం రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి గుండె జబ్బుల నివారణకు తోడ్పడతాయి

ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఇది శరీరానికి శక్తినిచ్చి, జీవక్రియను పెంచుతుంది లోటస్ రూట్‌ను ముక్కలుగా చేసి కూరలలో, ఫ్రైలలో వాడవచ్చు.

టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. వంట చేసి తినడం మంచిది, పచ్చిగా తింటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.