ఈ పాలు తాగితే.. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, అలర్జీ.. అన్ని దూరం
కొబ్బరి నీళ్ల వల్లే కాదు.. కొబ్బరి పాల వల్ల సైతం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మామూలు పాలలో లాక్టోజ్ ఉంటుంది. అవి తాగితే కొంత మందికి అలర్జీ వచ్చే అవకాశం ఉంది.
కానీ కొబ్బరి పాలలో లాక్టోజ్ ఉండదు. అందువల్ల అలర్జీ వచ్చే అవకాశం లేదు.
కొబ్బరి పాలలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణాశయం, పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొబ్బరిపాలలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు కొబ్బరిపాలను తాగితే మేలు జరుగుతుంది.
కొబ్బరిపాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. దాంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.
కొబ్బరిపాలతో జీర్ణాశయంలో పుండ్లు, అల్సర్లు నయమవుతాయి.
కొబ్బరిపాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్, లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
దాంతో దగ్గు, జలుబు తదితర శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. కొబ్బరిపాలతో షుగర్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
Related Web Stories
ఈ జంతువు పాలతో బోలెడు ప్రయోజనాలు..
మధుమేహంతో బాధపడే వారు మొక్క జొన్న తినొచ్చా?
అరటి పండు తినే సమయం ఇదే..
రాత్రి భోజనం తర్వాత సోంపు తినడం మంచిదేనా..