రాత్రి భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సోంపులో కేలరీలు తక్కువగా ఉన్నాయని, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి.

ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

రాత్రి భోజనం తర్వాత సోంపు తినడం వల్ల అలసట తగ్గి, హాయిగా నిద్రపడుతుంది.

నొప్పి, ఇతర ఋతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి భోజనం తర్వాత సోంపును తీసుకోవచ్చు.

రాత్రిపూట సోంపు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేసి నోటి దుర్వాసనను తొలగిస్తుంది.