Share News

Chandanagar Robbery: రెండు ఇళ్లలో భారీ చోరీ.. పోలీసుల పనితీరుపై ఆరోపణలు

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:33 PM

యజమాని రామ్మూర్తి కుటుంబం గత నెల 29 సత్యసాయి బాబా ట్రస్ట్ దర్శనానికి వెళ్లింది. తిరిగి ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Chandanagar Robbery: రెండు ఇళ్లలో భారీ చోరీ.. పోలీసుల పనితీరుపై ఆరోపణలు
Chandanagar Robbery

హైదరాబాద్, అక్టోబర్ 6: నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. గత రాత్రి రెండు ఇళ్లల్లోకి చొరబడ్డ దుండగులు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఖజానా జ్యువెలర్స్‌తో పాటు పలు దేవాలయాల్లో చోరీ ఘటనలు మరువక ముందే.. తాజాగా రెండు తాళం వేసిన ఇళ్లల్లో చోరీ చేశారు దుండగులు. ఓల్డ్ ఎంఐజీలోని సీతారామ్మూర్తి అనే రిటైర్డ్ బీహెచ్ఎల్ ఉద్యోగి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. 18 తులాల బంగారం, 60 తులాల వెండి, కొంత నగదును అపహరించారు.


యజమాని రామ్మూర్తి కుటుంబం గత నెల 29 సత్యసాయి బాబా ట్రస్ట్ దర్శనానికి వెళ్లింది. తిరిగి ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే.. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్‌కు చెందిన రైల్వే విహార్‌లోని ఇంటిలోనూ గత శనివారం రాత్రి దొంగతనం జరిగింది. ఇంట్లోని 5 తులాల బంగారం, 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు హెడ్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


గత కొంత కాలంగా చందానగర్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా దొంగతనాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దొంగతనాల నివారణకు చందానగర్ పోలీసులు ఏ మాత్రం చర్యలు తీసుకొని పరిస్థితి. ఇప్పటికే చందానగర్ పోలీసుల పనితీరుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి భారీ స్థాయిలో దొంగతనాలు జరగడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి...

రిజర్వేషన్లపై ఏకాభిప్రాయం.. అయినా కోర్టుకు వెళ్లారన్న మంత్రి

ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. విద్యార్థికి సాయం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 02:31 PM