Share News

BRS On Chalo Bus Bhavan: 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌‌

ABN , Publish Date - Oct 07 , 2025 | 04:19 PM

ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌‌కి పిలుపునిచ్చినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఛలో బస్ భవన్ ధర్నాలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సహా.. బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని తెలిపారు.

BRS On Chalo Bus Bhavan: 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌‌
BRS On Chalo Bus Bhavan

హైదరాబాద్‌, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌‌ (Chalo Bus Bhavan)కి పిలుపునిచ్చినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talsani Srinivas Yadav) పేర్కొన్నారు. ఛలో బస్ భవన్ ధర్నాలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సహా.. బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని తెలిపారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. నందినగర్ నుంచి కేటీఆర్.. మెహిదీపట్నం నుంచి హరీశ్‌రావు బస్సులో ప్రయాణం చేసి బస్ భవన్‌కి చేరుకుంటారని చెప్పుకొచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్.


పెంచిన బస్సు చార్జీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ‌నే.. వాళ్ల కుటుంబ సభ్యులపై భారం వేయడం అన్యాయమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయిన వారి సంఖ్యనే ఎక్కువని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పిందని గుర్తుచేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్.


గౌలిగూడ బస్ డిపోను రూ.400కోట్లకు ప్రైవేట్ వాళ్లకి ఇచ్చారని ఆరోపించారు. మియాపూర్, ఉప్పల్‌తో సహా.. వివిధ డిపోలను ప్రైవేటీకరణ చేయబోతున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి కార్మికులను ముంచాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతిస్తున్నామని.. కానీ ఆర్టీసీ డ్రైవర్లతోనే ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడపడానికి ఆర్టీసీ ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 04:28 PM