Share News

BRS MLC Ramana On Congress: విలాసవంతమైన జీవితాలు గడపాలనే ఆలోచన తప్ప మరేమీ లేదు

ABN , Publish Date - Sep 11 , 2025 | 02:21 PM

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన 61 హామీల్లో ఒకటి రెండు తప్ప ఏవీ అమలు చేయలేదని మండిపడ్డారు.

BRS MLC Ramana On Congress: విలాసవంతమైన జీవితాలు గడపాలనే ఆలోచన తప్ప మరేమీ లేదు
BRS MLC Ramana

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన 61 హామీల్లో ఒకటి రెండు తప్ప ఏవీ అమలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఏమార్చి విలాసవంతమైన జీవితాలు గడపాలనే ఆలోచన తప్ప మరేమీ లేదని మండిపడ్డారు.


మంత్రివర్గంలో ఎక్కువ మంది బిసి మంత్రులు ఉండాల్సిన అవసరం ఉందని, ప్రధాన శాఖలు బిసి మంత్రులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి సభకు ముందు శ్వేత పత్రం ఇవ్వాలని కోరారు. మొసలి కన్నీరు, కల్లబొల్లి మాటలతో ఈ ప్రభుత్వం కాలం గడుపుతోందని ఫైర్ అయ్యారు. బీసీల అంశంపై మాట్లాడాలని తాము భావిస్తే...అసెంబ్లీ వాయిదా వేసుకుని పోయారని విమర్శలు గుప్పించారు.


Also Read:

ఆగ్రాకు వెళ్తున్నారా? తాజ్ మహల్‌‌తో పాటు ఈ చారిత్రక ప్రదేశాలను చుట్టేయండి

ఏపీ లిక్కర్ స్కాం.. జగన్ సన్నిహితుడి ఇంట్లో సిట్ సోదాలు

For More Latest News

Updated Date - Sep 11 , 2025 | 02:22 PM