Share News

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి టీ20 ఆడేది డబ్బు సంచుల కోసమే: ఎమ్మెల్యే హరీశ్ రావు..

ABN , Publish Date - Feb 17 , 2025 | 01:53 PM

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక భావోద్వేగమని మాజీ మంత్రి చెప్పారు.

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి టీ20 ఆడేది డబ్బు సంచుల కోసమే: ఎమ్మెల్యే హరీశ్ రావు..
MLA Harish Rao

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఇవాళ (సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నీ జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తూ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. టపాసులు కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం కేసీఆర్‌కు పుట్టినరోజు విషెస్ చెబుతున్నారు. పుణ్య క్షేత్రాలకు వెళ్లి కేసీఆర్ పేరు మీద పూజలు చేయిస్తున్నారు. కాగా, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ భవన్ వద్ద నిర్వహించిన సమావేశంలో మీడియాతో హరీశ్ రావు మట్లాడారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. "బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఒక భావోద్వేగం. పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని నాటి నాయకులు కేసీఆర్‌ను విమర్శించారు. టీడీపీ నుంచి వచ్చిన మూడు పదవులకూ రాజీనామా చేసి‌ ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి ఆయన నడిచారు. కేసీఆర్‌ను వ్యక్తిత్వ హననం చేయాలని చూశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉక్కు సంకల్పం, మొండి పట్టుదలతో తెలంగాణ కోసం ఆయన పోరాడారు. ఆమరణ దీక్షకు కూర్చోని "కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో" అనే నినాదంతో ముందుకెళ్లారు. కేసీఆర్ దీక్షకు తలొగ్గి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


కానీ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని అలా ఇస్తేనే దీక్ష విరమిస్తానని కేసీఆర్ మెుండిపట్టుపడ్డారు. ఆ విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్‍గా కేసీఆర్ నిలిపారు. ఆయనిది, తెలంగాణ రాష్ట్రానిది తల్లీబిడ్డ బంధం. కేసీఆర్ పాలనపై కొంత మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. టీ20 మ్యాచ్ ఆడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ టీ20 మ్యాచ్ ఆడేది డబ్బు సంచుల కోసం. కేసీఆర్ డిఫెన్స్ ఆడుతారు.. అవసరమైతే సిక్స్ కొడుతారు. ఇప్పుడు మనం ఓడిపోవచ్చు.. కానీ, వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే. ఈసారి గెలిస్తే మళ్లీ మూడు టర్ములు మనమే ఉంటాం. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Students Protest: బాత్రూంలోకి తొంగిచూస్తున్నారు.. విద్యార్థినుల ఆందోళన

Seethakka: రాహుల్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు.. సీతక్క ఫైర్

Updated Date - Feb 17 , 2025 | 01:53 PM