KCR arrives Telangana Assembly: అసెంబ్లీకి కేసీఆర్.. అధికారపక్షానికి సినిమా చూపిస్తారా..
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:02 AM
KCR arrives Telangana Assembly: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 50 నిమిషాలు ముందుగానే తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ సమావేశమయ్యారు.

హైదరాబాద్, మార్చి 12: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly Budget Session) చేరుకున్నారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వచ్చేశారు గులాబీ బాస్. ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని నిర్ణయించుకున్నారు గులాబీ అధినేత. ఇందులో భాగంగా 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. ఈ క్రమంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఒకింత హాట్‌హాట్‌గానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. ముందుగా అసెంబ్లీ ఇన్నర్ లాబీలోని బీఆర్‌ఎస్‌ఎల్పీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత సమావేశమయ్యారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా పలువు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు సమయానికి సభకు రాలేదు. నిన్న(మంగళవారం) జరిగిన ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులంతా ముందుగానే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ పార్టీలోని పలువురు సభ్యులు మాత్రం తీరుమార్చుకోని పరిస్థితి.
మరోవైపు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రతిపక్షనేత కేసీఆర్‌ను అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ (Congress MLA Adinarayana) కలిశారు. మర్యాదపూర్వకంగానే కేసీఆర్‌ను కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. గతంలో ఆదినారాయణ బీఆర్ఎస్‌లో పనిచేశారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ ర్యాగింగ్
అయితే అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ముచ్చటించారు. ముఖ్యమంత్రి పేరు ఏంటంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణను అడిగారు కేటీఆర్. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంటూ సదరు ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ప్రోడక్ట్ కాబట్టి సరైన సమాధానం చెప్పారంటూ కేటీఆర్ టీజ్ చేశారు. అయితే 2014 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి బీఆర్ఎస్ తరవున ఆదినారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
Borugadda Anil: ఏపీ హైకోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ
AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..
Read Latest Telangana News And Telugu News