Raja Singh Targets BJP Leaders: వారిని తరమిస్తేనే.. పార్టీకి మంచి రోజులు.. రాజాసింగ్ సంచలన కామెంట్స్
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:09 PM
Raja Singh Targets BJP Leaders: సొంత పార్టీల ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లి పోవాలంటూ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్, మార్చి 13: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Rajasingh) సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే లేఖను రిలీజ్ చేశారు. తెలంగాణలో (Telangana) ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. కేంద్ర అధికారులు గమనించాలన్నారు. తెలంగాణ హిందూ సేఫ్‌గా ఉండాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లి పోవాలన్నారు.
కేంద్ర అధికారులు దీనిపైన ఆలోచన చేయాలని కోరారు. ఇది నా పార్టీ.. నా అయ్యా పార్టీ అనేవాళ్లు తెలంగాణలో చాలామంది ఉన్నారన్నారు. వాళ్లని రిటైర్ చేస్తేనే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు. ఇది తాను కాదు ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ అధికారులు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజాసింగ్ ఆ పార్టీపైనే మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో హిందూ ఐడియాలజికల్‌గా పోరాటం చేసిన వ్యక్తిగా రాజాసింగ్‌కు ప్రత్యేకమైన పేరు ఉంది. గతంలో కూడా బీజేపీని ఒకే సామాజిక వర్గానికి వ్యక్తులు శాసిస్తున్నారని, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉందంటూ బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్ రెడ్డి ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అప్పట్లోనే రాజాసింగ్ లేఖ రాశారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ధీటుగా ఎదిగే అవకాశం ఉంటుందని నెలరోజుల క్రితం రాజాసింగ్ విడుదల చేసి లేఖ కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తుండగా కొంతమంది బీజేపీ పార్టీ నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రహస్యంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అవుతున్నారని, ఇది బీజేపీకి మంచిది కాదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మొదటి నుంచి పేరుకుపోయిన చాలా మంది నేతలను పార్టీ నుంచి బయటకు పంపించి వేయాలని, వాళ్లని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. దాంతో పాటుగా పార్టీని తమ అయ్య జాగీరుగా భావిస్తున్న వారు బీజేపీలో చాలా మంది ఉన్నారని, వారంతో కొన్ని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అంటూ ఆరోపణలు చేస్తూ లేఖను రిలీజ్ చేశారు రాజాసింగ్. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నవారి వివరాలు తనకు తెలుసని.. వారిపై త్వరలోనే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు లేఖలో పేర్కొన్నా రాజాసింగ్. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
Read Latest Telangana News And Telugu News