Kishan Reddy: ఆ లేఖకు కట్టుబడే ఈ నిర్ణయం తీసుకున్నాం..
ABN , Publish Date - May 01 , 2025 | 05:17 PM
Kishan Reddy: దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. అలాంటి వేళ.. కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు.
న్యూఢిల్లీ, మే 01: కేంద్ర మాజీ మంత్రి సుస్మా స్వరాజ్ ఇచ్చిన లేఖకు కట్టుబడి కులగణనపై తాము నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతకాని కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు భయపడి తాము ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. గతంలో జనగణన చేసేటప్పుడు కులగణన చేస్తామని హోం మంత్రి అమిత్ షా చెప్పారని ఆయన గుర్తు చేశారు.
దేశానికి, సమాజానికి మేలు చేసే నిర్ణయాలను తీసుకునే దమ్ము తమకు ఉందని చెప్పారు. అంతకానీ ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకునే స్టేజ్‌లో తాము లేమన్నారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో జనగణనలో కులగణన చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది సానుకూలమైన మార్పుకు నాందిగా ఆయన అభివర్ణించారు.
చరిత్రపూటల్లో నిలిచిపోయే నిర్ణయాన్ని ప్రధాని మోదీ తీసున్నారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు రాజకీయ నాటకాలకు తెర లేపాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బీసీల్లో చేర్చే కుట్ర చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకస్తూ పోటీ చేసింది గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు బీజేపీ పరిష్కారం తీసుకోచ్చిందని వివరించారు.
బీసీ సామజిక వర్గాల నేత అయినా మోదీని ప్రధానిని చేసిందన్నారు. ఇంగితాజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రధాని కులం పేరుతో దుషించిందని మండిపడ్డారు. బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్‌లో భాగంగా 10 రిజర్వేషన్లు దక్కని వారికీ కూడా రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ రద్దు వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోచ్చామని గుర్తు చేశారు.
కులగణనకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. మొదటి జనగణనలో కులగణన చేశారన్నారు. బీసీల కంటే ముస్లింలే వెనకబడి ఉన్నారని వారిని ఆదుకోవాలని మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ మాజీ నేత రాజీవ్ గాంధీదని గుర్తు చేశారు. బీసీలను పక్కన పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ కల్పించిందన్నారు. 2011లో జరిగే జనగణనలో కులగణన చేపట్టాలని 2010లోనే బీజేపీ తరపున సుస్మా స్వరాజ్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్ఖీలకు లేఖ రాసిందన్నారు.
బీజేపీ డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ కులగణనకు ముందుకు రాలేదని చెప్పారు. కులగణనతో అన్ని సామజికవర్గాలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేత చిదంబరం కులగణనను వ్యతిరేకించిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముస్లింలను బీసీల్లో చేర్చేలా కాంగ్రెస్ వ్యవహరించినట్లుగా తాము వ్యవహారించామ్నారు. నిజమైన కులగణన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేపట్టలేదని విమర్శించారు. బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన శాస్త్రీయంగా జరగాలని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Attack Plea: పహల్గాం దాడి ఘటనపై న్యాయవిచారణ.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్
Pahalgam Terror Attack: పహల్గామే కాదు.. ఆ అటాక్ చేసింది కూడా వీరే..
Pehalgam Terror Attack: భారత్‌లోని పాకిస్థానీలకు కేంద్రం గుడ్ న్యూస్
High alert: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్.. ఎందుకంటే..
Pehalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం
Pakistan: పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై కీలక విషయాన్ని వెల్లడించిన ఆదర్శ్ రౌత్