TG BJP Chief Arrest: రాష్ట్ర బీజేపీ చీఫ్ అరెస్ట్.. ఖండించిన కేంద్ర మంత్రి
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:52 PM
రాష్ట్రంలోని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలో నడుస్తోందని కేంద్రం హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్‌ను ఆయన ఖండించారు.
హైదరాబాద్, ఆగస్టు 22: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజా సమస్యలై సెక్రటేరియ్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల పర్యటనలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావును మొయినాబాద్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్రమ అరెస్టులతో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకనే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు మండిపడ్డారు.

అరెస్ట్‌పై స్పందించిన కేంద్ర మంత్రి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర హోమ్ శాఖ సహయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా పోలీసులను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం గత బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తుందని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనుకుంటుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. అయినా బీజేపీ అంటే అంత భయమెందుకు అని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని అభివర్ణించారు. తక్షణమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అరెస్టయిన బీజేపీ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
ఆయనకు రాజకీయంగా మెచ్యురిటీ రాలేదు
Read Latest Telangana News and National News