Suryapet Road Accident: దసరాకు వెళ్లొస్తూ.. అన్నదమ్ములు మృతి..
ABN , Publish Date - Oct 03 , 2025 | 10:24 AM
మృతులిద్దరు అన్నదమ్ములుగా పోలీసులు చెప్పారు. నాగరాజు హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరాకు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో జరిగినట్లు పేర్కొన్నారు.
సూర్యాపేట: తుంగతుర్తి మండలం బండరామారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు అదుపుతప్పి కిందపడటంతో.. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలసులు సంఘటనా స్థలాని చేరుకున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరశీలించారు. మృతి చెందిన వారిని తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన వేముల నాగరాజు (26), వేముల కార్తీక్ (24)గా గుర్తించారు.
మృతులిద్దరు అన్నదమ్ములుగా పోలీసులు చెప్పారు. నాగరాజు హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తిలో అమ్మమ్మ ఇంటికి దసరాకు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో జరిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అన్నదమ్ముల మృతితో మాలిపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..
President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్